nowgam-info-మన-ఊరి-కోసం-మనందరికీ

🌾 గ్రామ ప్రజల మధ్య సంబంధాన్ని పునఃనిర్మించేందుకు ఒక డిజిటల్ వేదిక 🌐


❝ ప్రతి గ్రామానికి తన స్వంత డిజిటల్ వేదిక ఉండాలి ❞

మన ఊరు… మన సమస్యలు… మన పరిష్కారాలు. కానీ మనం ఎక్కడ మాట్లాడుకోవాలి? ఎక్కడ పంచుకోవాలి? ఎక్కడ మలచుకోవాలి? అదే ఆలోచనతో Nowgam.info పుట్టింది.



ఊర్లో జరిగే అంశాలను – వార్తలు, అభివృద్ధి, సమస్యలు, సమావేశాలు, పండుగలు – ఎక్కడో కాకుండా ఊరే ఓన్ చేసుకునే వేదిక మీద చర్చించాలి.

WhatsApp వంటి దిగ్గజాలు మనం ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి చాలా ఉపయోగపడుతున్నాయి.
Facebook లో మిత్రులతో నెట్వర్క్ బాగానే ఉంటుంది.


కానీ మన ఊరి సమస్యలపై స్పష్టత ఉండాలంటే…
సంఘటిత చర్చ,
స్థానిక పరిష్కారాలు,
దిశగా ముందుకెళ్లే తీరు అవసరం.

అవి ఏవీ మనకు అక్కడ సాధ్యం కావడం లేదు.


📌 ఉదాహరణగా చెప్పాలంటే…

మన ఊరిలో అనేక WhatsApp గ్రూపులు ఉన్నాయి:

  • మన ఊరి వార్తలు,
  • Nowgam Employees,
  • ఇంకా చాలా…

ఈ గ్రూప్స్ సమాచారం చాలా ఉపయుక్తం గా ఉంటుంది. తొందరగా సమాచారం చెరవేయబడుతుంది. చాలా ఈజీ గా కూడా.

కానీ:

ఒక విషయం పై నిర్మాణాత్మక చర్చ జరగాలంటే ఏం జరుగుతుంది?

ఊరిలో లైబ్రరీ పెట్టాలన్న ఆలోచన మొదలెట్టాం అనుకుందాం.

WhatsApp లో ఓపెన్ చేస్తే…
అదే రోజులో ఓ ముగింపు లేకుండా చర్చ గాలిలో కలిసిపోతుంది. అక్కడ నుండి ఎటూ జరగదు.


🌐 అందుకే – Nowgam.info

ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారంగా
Nowgam.info రూపకల్పన చేశాం.

ఇది కేవలం ఒక website కాదు –
ఒక కొత్త గ్రామ సంస్కృతికి బీజం.
అందరి అభిప్రాయాలు ఒక చోట
అర్ధవంతంగా చర్చించగల వేదిక.
ప్రముఖుల పరిచయాలతో
తరాలు తరబడి కదలగల వేదిక


💡 మన వేదికలో ఉన్న ప్రత్యేకతలు

🧑‍🤝‍🧑 ప్రొఫైల్ లు & కనెక్షన్లు

ప్రతి సభ్యుడు ప్రొఫైల్ సృష్టించుకోగలడు

ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వృత్తిపరులు

ఎవరెక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు తెలుసుకోండి

ఒకరికొకరు సహాయం చేసుకునే ఛాన్స్

📚 చర్చా వేదికలు

అంశాల వారీగా forums

గ్రామ అభివృద్ధి పై నిర్మాణాత్మక చర్చలు

మన ఊరి సమస్యలు – మనమే మాట్లాడుకుందాం

🧵 సమూహాల ఏర్పాట్లు

ఉద్యోగుల సమూహాలు

విద్యార్థుల గైడెన్స్ గ్రూపులు

మహిళల చర్చా వేదికలు,Nowgam-Hyderabadites, Nowgam-Vizagites ….

అవసరమైన ఎన్ని గ్రూప్ లైన create చేసుకోవవచ్చు

ప్రైవేట్ /పబ్లిక్ గ్రూప్ ల సదుపాయం ఉంది

గ్రూప్ ల నందు జూమ్ మీటింగ్ సదుపాయం

📰 ఊరి వార్తలు & విశేషాలు

  • స్థానిక పరిణామాలు
  • పండుగలు, కార్యక్రమాలు
  • పాత చిత్రాలు, పురాణ చరిత్ర

🌍 మరిన్ని విభాగాలు

  • మన ఊరి చరిత్ర
  • ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు
  • గ్రామాభివృద్ధికి తాము ఏవిధంగా సహకరించాలనుకుంటున్నారో సూచించడానికి ప్రత్యేక స్థానాలు

🧭 మన వేదిక వల్ల కలిగే ప్రయోజనాలు

✔️ మన ఊరి సమస్యలపై చర్చలు – దిశతో
✔️ స్థానిక పరిష్కారాలపై నిర్ణయాలు
✔️ గ్రామానికి సంబంధించి ఉన్నతుల నెట్‌వర్క్
✔️ విద్యార్థులకు మార్గదర్శకుల చేరవలసిన మార్గం
✔️ గ్రామ అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం


✍️ ఎలా చేరాలి?

  1. Nowgam.info వెబ్‌సైట్ కి వెళ్లండి
  2. Register చేసుకోండి
  3. మీ ప్రొఫైల్ పూర్తి చేయండి
  4. మీరు సంబంధిత గ్రూప్‌ లలో చేరండి
  5. మీ ఊరిని మీరు మలచండి!

✅ ఈ రోజు నుండే మొదలుపెట్టండి!

📌 మీ ఊరికి మీరు సృష్టించిన వేదిక ఇది
📌 మీ అనుభవాన్ని, మీ అభిప్రాయాన్ని ఇప్పుడు పంచుకోండి

👉 ఇప్పుడే Nowgam.info లో చేరండి



మన ఊరు – మన వేదిక – మన భవిష్యత్తు!

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.